సంకల్పం,షోడశోపచారపూజ,అథాంగ పూజ,ఏకవింశతి పత్రపూజ

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే௨0ఘ్రియుగం స్మరామి యత్రయోగేశ్వరః
లాభస్తేషాం,జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్ధనః 

 సంకల్పం:
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సర్వజిన్నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్ద్యాం వాసరః స్థిరవాసర యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ది వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .

షోడశోపచారపూజ:
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥ శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥ ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥ ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥ పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥ ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥ మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥ పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥ శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥ వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥ ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥ గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥ అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥ పుష్పాణి పూజయామి.

 అథాంగ పూజ:
(పుష్పములతో పూజించవలెను)
ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమః - కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
ఓం గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ :
ఓం సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
ఓం గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
ఓం లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
ఓం గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
ఓం గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
ఓం భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
ఓం వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
ఓం సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఓం ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
ఓం హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
ఓం సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఓం ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
ఓం వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
ఓం సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
ఓం కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.